- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP: ఆ రూ.7.20 లక్షల కోట్లు తాడేపల్లి నేలమాళిగల్లో దాచారా?
దిశ, డైనమిక్ బ్యూరో: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పులశాఖామంత్రిగానే సుప్రసిద్ధులంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సెటైర్లు వేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరిత బడ్జెట్ అని ఆయన విమర్శించారు. రూ.9 లక్షల కోట్ల అప్పులభారం రాష్ట్రంపై వేసినా జగన్ బటన్ నొక్కి ప్రజలకు రూ.లక్షా 80 వేల కోట్లు అందించానన్నాడని మండిపడ్డారు. మిగిలిన రూ.7.20 లక్షల కోట్లు ఎవరిజేబుల్లోకి వెళ్లాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు. తాడేపల్లి నేలమాళిగల్లో దాచారా? అని ప్రశ్నించారు. అప్పుల్ని ఘనంగా చూపుతున్న బుగ్గన, నిధులకేటాయింపులు, ఖర్చుల్నిమాత్రం అథమంగా చూపుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయంలో ప్రభుత్వం చూపిన కేటాయింపులు, వాస్తవంలో రైతులకోసం ఖర్చుచేయడం లేదన్నారు.
ఏపీలో ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం అనేలా చంద్రబాబు 2014-19 మధ్యన రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుంచారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే దాన్ని బాగుచేయడానికి రూ.2వేలకోట్లు కేటాయించలేని జగన్ రాష్ట్రరైతాంగాన్ని, వ్యవసాయాన్ని ఉద్ధరిస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు.
జలజీవన్ మిషన్ కింద ప్రతిఇంటికీ తాగునీరు అందించేందుకు కేంద్రప్రభుత్వం తనవాటాగా నిధులిస్తే, జగన్ ప్రభుత్వం తనవా టాకింద ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేకపోయింది అని ఆరోపించారు. దాంతో జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ ఏపీలో అమలుకు నోచుకోలేదని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం కేంద్రప్రభుత్వం 90 శాతం నిధులిస్తుంటే, రాష్ట్రవాటాగా 10శాతం నిధులివ్వలేక జగన్ ఆపథకాన్నికూడా అటకెక్కించాడు అని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని కూడా పేదలకు ఇవ్వకుండా అమ్ముకుంటున్న వ్యక్తి జగన్ అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.