AP:‘శ్వేత పత్రాల విడుదలతో వైసీపీ నేతలకు భయం పట్టుకుంది’..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP:‘శ్వేత పత్రాల విడుదలతో వైసీపీ నేతలకు భయం పట్టుకుంది’..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేత వైసీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ఎందుకిచ్చామని ప్రజలు ఆలోచనలో పడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలన ఎలా చేశారో ప్రజలకు తెలియజేయాల్సన బాధ్యత తమపై ఉంది కాబట్టే సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారన్నారు. శ్వేతపత్రాల విడుదలతో వైసీపీ వాళ్ల దొంగతనాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడిపోతున్నారని విమర్శించారు.

Next Story