ఆ ముగ్గురిని CM జగన్, YCP నేతలు కలిసి చంపేశారు: వర్ల రామయ్య సంచలన ఆరోపణలు

by Satheesh |   ( Updated:2023-01-02 08:39:21.0  )
ఆ ముగ్గురిని CM జగన్, YCP నేతలు కలిసి చంపేశారు: వర్ల రామయ్య సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరులో ఆదివారం నిర్వహించిన చంద్రన్న కానుక కార్యక్రమం ఓ ఎన్నారై సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమమని టీడీపీ నేత వర్ల రామయ్య స్పష్టం చేశారు. పోలీసుల అనుమతితోనే ఆ కార్యక్రమం నిర్వహించామని.. పోలీసులు ముందుగానే వచ్చి సభా స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. చంద్రన్న కానుక కార్యక్రమంలో ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా.. లేక వారిని చంపేశారా..? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ కుట్ర కోణాన్ని సీఎం జగన్ బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రన్న కానుక కార్యక్రమంలో మృతి చెందిన వారిని సీఎం జగన్, ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ వైసీపీ స్లీపర్ సెల్స్ చేస్తున్న కుట్రలు అని ఆరోపించారు. చంద్రబాబు సభలకు వస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.

Also Read...

Guntur Ycp Leaders: చంద్రబాబును ఏ1గా చేర్చాలని ఎస్పీకి ఫిర్యాదు

Advertisement

Next Story