- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chandrababu: వైఎస్సార్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత సీఎం వైఎస్ఆర్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘ ఓ అంశంలో వైఎస్ఆర్ ప్రశ్నిస్తే గెట్ ఔట్ అని బయటకు వెళ్లమన్నా. నా హక్కుల గురించి చెప్పి మరీ బయటకు పంపాను. నాపై రాజశేఖర్ రెడ్డి చాలా కేసులు వేశాడు. నేను ఏ తప్పు చేయలేదు. ధైర్యంగా అన్నీ ఎదుర్కొన్నా. కానీ ఇప్పుడు జగన్ తప్పులు చేయకుండానే కేసులు పెడుతున్నాడు. ఆర్కిటక్చర్ డైజెస్ట్ అనే మ్యాగజైన్ ప్రపంచంలోని గొప్ప నగరాలపై ఆర్టికల్ ప్రచురించింది. ఇందులో 6వ స్థానం అమరావతికి స్థానం దక్కింది. మనం పర్మినెంట్ కాకపోవచ్చు. కానీ రాష్ట్రం పర్మినెంట్ అనే ఉద్దేశ్యంతో పనిచేశాం. అమరావతి విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారు’ అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్వకేట్లే కాపాడుతున్నారు
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన అడ్వకేట్లే తమను కాపాడుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఏకంగా 47 మంది అడ్వకేట్లకు టీడీపీ నాడు టిక్కెట్లు ఇచ్చిందని, అలాంటి వారిలో యనమల రామకృష్ణుడు, జీఎంసీ బాలయోగి, ఎర్రన్నాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా అనంద్‌లు ఉన్నారని గుర్తు చేశారు. ఒకప్పుడు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కనకమేడల రవీంద్రకుమార్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
చరిత్రలో అడ్వకేట్లకు పాత్ర ఎప్పుడూ కీలకం
వైసీపీ ప్రభుత్వ అక్రమ కేసుల నుంచి నాలుగేళ్లుగా టీడీపీ నేతలను, కార్యకర్తలను కంటికి రెప్పలా అడ్వకేట్లు కాపాడుతున్నారని కొనియాడారు. చరిత్రలో అడ్వకేట్లకు పాత్ర ఎప్పుడూ కీలకమేనన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో కూడా లాయర్లు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తొలి ఎన్నికల్లో 20 మంది డాక్టర్లు, 8 మంది ఇంజనీర్లు, 125 గ్రాడ్యుయేట్లు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు టీడీపీ టిక్కెట్లు ఇచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేశారు.