దమ్ముంటే రాజీనామా చేయండి.. వైసీపీ ఎమ్మెల్యేలకు బీటెక్ రవి సవాల్

by srinivas |
దమ్ముంటే రాజీనామా చేయండి.. వైసీపీ ఎమ్మెల్యేలకు బీటెక్ రవి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: దమ్ముంటే రాజీనామాలు చేయాలని వైసీపీ(Ycp) ఎమ్మెల్యేలకు టీడీపీ నేత బీటెక్ రవి(TDP leader BTech Ravi) సవాల్ విసిరారు. అసెంబ్లీ(Assembly) నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. సంతకం కోసమే వైఎస్ జగన్(Ys Jagan) అసెంబ్లీకి వెళ్లారని వ్యాఖ్యానించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ(Deputy Speaker Raghurama) ఆర్టికల్‌పై చర్చించినప్పుడే 10 మంది ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో వైసీపీ వినిపించాలని సూచించారు. దమ్ముంటే 11 మంది రాజీనామాలు చేయాలని, ఉప ఎన్నికలకు తాను సిద్ధమేనన్నారు. పులివెందుల(Pulivendula)లో కూడా జగన్‌ గెలవలేరని బీటెక్‌ రవి జోస్యం చెప్పారు.

కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ కూడా హాజరయ్యారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో అసెంబ్లీ నుంచి వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు కురిపిస్తున్నారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండి చర్చల్లో పాల్గొనాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా టీడీపీ నేత బీటెక్ రవి కూడా స్పందించారు.



Next Story

Most Viewed