- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వాళ్లు పార్టీలోకి వస్తున్నారని తెలిసింది’.. వెల్‌కమ్ చెబుతూ మాజీ ఎమ్మెల్యే స్వీట్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: పెనమలూరు టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ కొత్తగా పార్టీలోకి వచ్చే మిత్రులను తప్పకుండా ఆహ్వానిస్తామని ప్రకటించారు. కానీ, ఇంతకాలం పార్టీలో కష్టపడి పనిచేస్తూ, కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్న వారికి సముచిత స్థానం, గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి తమపై పెత్తనం చేస్తామంటే తాము ఊరుకోబోమని, కార్యకర్తలు రగిలిపోతారని హెచ్చరించారు. ఇటీవల కొందరు పార్టీలోకి వస్తున్నారని తెలిసింది.. వారికి తమ ఆహ్వానం కూడా ఉంటుందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
కాగా, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పలువురు నేతలు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీలో టికెట్ రాదని తెలిసిన వారు వైసీపీలోకి, వైసీసీలో టికెట్ దక్కని వారు టీడీపీలోకి విస్తృతంగా పార్టీలు మారుతున్నారు. ఈ రెండు పార్టీలో టికెట్ రాదని తెలిసిన వారు జనసేన గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. మరోవైపు ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.