- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీలకు టీడీపీతోనే న్యాయమని మరోసారి నిరూపితమైంది: టీడీపీ ఎమ్మెల్యే
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి,అనంతపురం: బీసీ సంక్షేమ, జౌళి, చేనేత శాఖల మంత్రి సవితను మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం కలిశారు. ఆమెకు మంత్రి పదవి వచ్చిన నేపథ్యంలో పెనుకొండకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పరిటాల సునీతకు మంత్రి సవిత ఎంతో గౌరవంగా స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరువురు నేతలు పలు అంశాలపై కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగేది ఒక్క తెలుగుదేశం పార్టీతోనేనని.. సవితకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఇది మరోసారి నిరూపిత మైందన్నారు. మహిళలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సవిత రాజకీయాల్లో ఎంతో కష్టపడి పైకొచ్చారని..ఆమెకు సముచితమైన స్థానం దక్కిందన్నారు. కచ్చితంగా ఆమె బీసీలకు, చేనేతలకు న్యాయం చేసే విధంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story