- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'రూ.1600 కోట్లతో ఫామ్‌హౌజ్ కొన్న Brahmani Nara!'

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద హైదరాబాద్‌లో ఉన్న ఫామ్ హౌస్‌ను రూ. 1600 కోట్లకు కొన్నట్టు సోషల్ మీడియాలో ట్వీట్‌లు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో బ్రాహ్మణి పేరుతో వస్తున్న ప్రచారంపై టీడీపీ మండిపడింది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇందులో ఎటువంటి నిజం లేదని.. ఇదంతా ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది. అందుకు సంబంధించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ కూడా టీడీపీ పార్టీ షేర్ చేసింది.
'తన పైనా, తన భార్య పైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా పోలీసు బలగాన్ని పంపి కేసులు పెట్టించే జగన్ రెడ్డి.. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయించడం ఏంటి' అని ప్రశ్నించారు. తనకో ధర్మం ఎదుటివాళ్లకు ఇంకో ధర్మం ఏంటని మండిపడ్డారు. నారా బ్రాహ్మణి ఒక నిరుపేద అని, అలాంటి మహిళ రూ.1600 కోట్లతో ఫామ్‌హౌజ్ ఎలా కొంటుందని, అంత డబ్బు తన వద్ద ఎక్కడిదని అడిగారు. కాగా, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేసేందుకు నారా బ్రాహ్మణి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.