ChandraBabu Naidu, Lokesh కు ప్రాణహాని: మాజీ ఎమ్మెల్సీ Buddha Venkanna వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-02-04 14:39:56.0  )
ChandraBabu Naidu, Lokesh కు ప్రాణహాని: మాజీ ఎమ్మెల్సీ Buddha Venkanna వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌కు ప్రాణహాని ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ యువనేత లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర జరిగింది తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు రాకపోయినా పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. లోకేష్ పాదయాత్రను ఎవరైనా ఆపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బుద్దా హెచ్చరించారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఈ నెల 27వ తేదీన కుప్పంకు లక్షలాది జనం వస్తారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించరాదంటూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం 1 నేపథ్యంలో లోకేష్ పాదయాత్రపై సస్పెన్స్ నెలకొంది. లోకేష్ పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతుండగా.. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర చేసి తీరుతామని తెలుగుదేశం కార్యకర్తలు అంటుండటంతో ఈ నెల 27వ తేదీన ఏపీలో ఏం జరగనుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story