నేడు పెనుకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన

by Mahesh |   ( Updated:2024-03-04 07:07:02.0  )
నేడు పెనుకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ వేడి పెరిగిపోంతుంది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ మినహా ఏపీలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ ఎలాగైన మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే సిద్ధం సభలతో దూసుకుపోతుంది.

మరోపక్క టీడీపీ అధినేత కూడా రా.. కదలిరా సభలతో ఏపీని చుట్టేస్తున్నారు. తమకు బలం ఉన్న నియోజకవర్గాలతో పాటు, జనసేన క్యాడర్ అధికంగా ఉన్న సెగ్మెంట్లలో టీడీపీ భారీ సభలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పెనుగొండ మండలం, ఎర్రమంచి గ్రామ సమీపంలోని కియా పరిశ్రమ ద్ద జరిగే.. రా.. కదలిరా సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ జరుగనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. కాటా ఇటీవల జరిగిన టీడీపీ సభలకు భారీ ఎత్తున జనం వస్తుండటంతో ఆ పార్టిలో మరింత ఉత్సాహం నెలకొంది.

Read More..

టీడీపీ నేతల నివాసాల్లో పోలీసుల సోదాలు!

Advertisement

Next Story

Most Viewed