- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో దొంగ ఓటర్లు పడ్డారు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఓట్లదొంగలు. దొంగ ఓట్లనమోదుతో సరికొత్త రికార్డులతో జగన్ ప్రపంచంలోనే 8వ వింత నమోదు చేశాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 2019 నుంచి జరిగిన ప్రతిఎన్నికల్లో జగన్, అతని ప్రభుత్వం వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని గెలిచింది తప్ప, ప్రజాబలంతోకాదు అని ఆరోపించారు. వైసీపీ దొంగ ఓట్లకు పాల్పడిందని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే తాము తీసుకొచ్చిన అంశాలపై క్షేత్రస్థాయిలో విచారించి, చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. దొంగఓట్ల వ్యవహారంపై టీడీపీ న్యాయపరంగా, క్షేత్రస్థాయిలో పోరాడి వైసీపీ ప్రభుత్వ ఆటకట్టిస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఓట్లదొంగలు పడ్డారు, వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల్ని మేనిప్లేట్ చేయడం అలవాటుగామారింది. 2019తర్వాత జరిగిన ఎన్నికలన్నింటిలో జగన్ వ్యవస్థల్ని మేనిప్లేట్ చేసి గెలిచాడు అని ఆరోపించారు. ఏ ఎన్నికసక్రమంగా జరగడంలేదని తాముగతంలోనే నెత్తీనోరు కొట్టుకున్నాం. ప్రజలకు కూడా ఇది అర్థమైంది. 2100 ఇంటినంబర్లతో లక్షా85వేల దొంగ ఓట్లుచేర్పించారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 14నియోజకవర్గాల్లో వైసీపీప్రభుత్వం ఇష్టానుసారం దొంగఓట్లు చేర్పించింది. ఈ దొంగఓట్ల తంతుకి సంబంధించిన ఆధారాల్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ముందు ఉంచినట్లు తెలిపారు. ఈ దొంగఓట్లపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినట్లు తెలిపారు.
జూలై 21వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ జాబితా పరిశీలన జరుగుతుందని..ఆ ప్రక్రియ అక్టోబర్ 7వరకు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఆ పరిశీలనలో బీ.ఎల్.వో లు అందరూ ప్రతిఇంటికెళ్లి, ప్రతిఓటర్ ని వెరిఫై చేసి, అసలు ప్రతిఇంటిలో ఉన్న ఓటర్లుఎంతమంది.. ఉండాల్సినవారు ఎక్కడికైనా వెళ్లారా.. వలసవెళ్తే ఎంతమంది వెళ్లారనే వివరాలు సేకరిస్తారని ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసినవారిలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మాజీశాసనసభ్యులు దివిశివరాం తదితరులు ఉన్నారు.