Pawan Kalyan:‘నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి’..డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Pawan Kalyan:‘నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి’..డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి తాము పూర్తి సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనలో ఖజానా ఖాళీ అయ్యిందన్నారు. పోలవరం, అమరావతి ఆగిపోయాయని తెలిపారు. గత వైసీపీ పాలనలో సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని చెప్పారు. అయితే ఎవరూ కక్ష సాధింపులకు పాల్పడవద్దు.. దాడుల పై చట్ట ప్రకారమైన చర్యలు ఉంటాయని ఎవరు దాడులకు పాల్పడవద్దు అని పేర్కొన్నారు. ఉచిత ఇసుక వంటి వ్యవహారాల్లో జనసేన సభ్యుల పాత్ర ఉండకూడదు. కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగజేసేలా వ్యవహరిస్తే ఏ సభ్యుడినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని పవన్ అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని తెలిపారు. ‘నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed