- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుతో వైసీపీలో భారీ కుదుపు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి టీడీపీకి ఓటు వేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్‌చేసింది. ఈపాటికే దూరమైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితోపాటు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై సస్పెన్షన్వేటేశారు. దీనివల్ల పార్టీకి నష్టమా, ప్రయోజనమా అనేది పక్కన పెడితే.. క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే పార్టీ నాయకత్వం చులకనైపోతుందని సీఎం జగన్భావించి ఉండొచ్చు. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ యంత్రాంగాన్ని కుదిపేస్తోంది. అసంతృప్తి నేతలు సైతం తాడోపేడో తేల్చుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సీటు గ్యారంటీ లేనోళ్లు, ఇతర పార్టీల్లో కర్చీఫ్వేసుకున్నోళ్లు సర్దుకోవడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ శ్రేణుల్లోనేగాక రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
దిశ, ఏపీ బ్యూరో : పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల ఎన్నిక అంటేనే ఎంతో హుందాగా ఉండాలి. దీనికి భిన్నంగా సార్వత్రిక ఎన్నికలను తలదన్నేట్లు అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున ప్రచారంతో నానా హడావుడి సృష్టించింది. డిగ్రీ లేని వాళ్లను గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా చేర్పించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ స్థాయిలో ప్రలోభాలకు పాల్పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఏ పార్టీ కూడా ఇంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు రాష్ట్ర చరిత్రలో లేదు. ఇంత చేసినా చివరకు గ్రాడ్యుయేట్ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోయింది. తర్వాత మరింతగా రెచ్చిపోయి ఎమ్మెల్యేల కోటా ఎన్నికల్లో పనిచేసింది. సొంత ఎమ్మెల్యేలను క్యాంపుల్లో పెట్టింది. అసంతృప్తి ఎమ్మెల్యేలపై నిఘా ఏర్పాటు చేసింది. ఇంత చేసేకన్నా ఉదారంగా ఆరు సీట్లకు పోటీ చేసి విపక్షానికి ఒకటి వదిలేస్తే గౌరవంగా ఉండేది. ప్రతిపక్షం కనపడకూడదనే ఉక్రోషంతోనే జగన్ ఉన్నారు. దీంతో 7 స్థానాలకు పోటీ చేసి ఒక స్థానంలో టీడీపీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీన్ని భరించలేక టీడీపీ అభ్యర్థికి ఓటేసిన ఇద్దరితోపాటు పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన మరో ఇద్దర్ని వైసీపీ అధిష్ఠానం సస్పెండ్‌చేసింది.
ఫలించిన టీడీపీ మైండ్ గేమ్
నిన్నమొన్నటిదాకా తమతో 16 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతుంటే మైండ్గేమ్ఆడుతున్నట్లు వైసీపీ భావించింది. అసలు తమ పార్టీలో ఏ ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నారు.. ఇది ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించలేదు. పార్టీ అధిష్ఠానం ఏం చేసినా ఎమ్మెల్యేలకు వేరే దారి లేదు. ప్రతిపక్షం ఎన్నికలను ఎదుర్కొనే స్థితిలో కూడా లేదు. అందువల్ల చచ్చినట్టు పార్టీలో పడి ఉండాల్సిందేనన్న భావన వైసీపీ పెద్ద తలకాయల్లో ఉంది. నిన్నమొన్నటిదాకా ఎమ్మెల్యేలు ఎవరూ కిక్కురుమనలేదు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో ధిక్కరణ మొదలైంది. చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని కాదని ప్రతిపక్షానికి ఓట్లు వేసేదాకా చేరింది. ఈ ధిక్కార స్వరం ఎందాకా వెళ్తుంది.. ఎంతమంది బయటకు వెళ్తారనేది అంచనాలకు అందడం లేదు.
విప్ పై వైసీపీ ముందుచూపు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ విప్‌జారీ చేయలేదు. టీడీపీ జారీ చేసింది. ఒకవేళ వైసీపీ విప్‌జారీ చేసి ఉంటే నలుగురు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రయోగించి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. అదే సమయంలో వైసీపీకి ఓటేసిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావాలి. వాస్తవానికి ఈ నలుగురి ఓట్లు చూసుకునే వైసీపీ ఏడుగుర్ని బరిలో దించింది. అందుకే విప్‌జారీ చేయనట్లు తెలుస్తోంది.
ఇది ఇంతటితో ఆగేనా?
సస్పెన్షన్‌కు గురైన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ అన్ని స్థానాలనూ గెల్చుకొని రికార్డు సృష్టించింది. ధిక్కారం కూడా ఇక్కడే ప్రారంభమైంది. తాజా పరిణామాలతో పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో భారీ ఎత్తున చీలిక వచ్చే ప్రమాదం లేకపోలేదని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇది ఇంతటితో ఆగకుంటే పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకెందరు ఎమ్మెల్యేలు జారిపోతారు.. ఏఏ సామాజిక వర్గాలు దూరమవుతాయోనన్న చర్చ నడుస్తోంది. పార్టీని జగన్ఒంటిచేత్తో గెలిపిస్తారని ఆర్నెల్ల కిందటి వరకు అంచనాలుండేవి. ఆ తర్వాత ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లకుంటే విజయం సాధించలేమని గ్రహించారు. ఇప్పుడసలు ఎంతమంది ఉంటారు.. ఏమేరకు డ్యామేజీ జరుగుతుందోనని పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.