అనంతలో స్టాట్యూ వార్.. బీజేపీ వర్సెస్ వైసీపీ:తగ్గేదే లే అంటున్న విష్ణువర్థన్ రెడ్డి

by Seetharam |
అనంతలో స్టాట్యూ వార్.. బీజేపీ వర్సెస్ వైసీపీ:తగ్గేదే లే అంటున్న విష్ణువర్థన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురం జిల్లాలో విగ్రహాల వార్ నడుస్తోంది. బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం మారింది. సర్ధార్ వల్లభాయ్ విగ్రహం పెడతామని బీజేపీ అంటుంటే టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని వైసీపీ చెప్తోంది. దీంతో ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని అధికారులకు బీజేపీ దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తుపై అధికారులు స్పందించాల్సి ఉంది. ఇంతలో కొంతమంది వైసీపీ నేతలు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు బీజేపీ అనుకున్న స్థలంలోనే ఏకంగా భూమి పూజ కూడా చేసేశారు. ఈ వ్యవహారం అటు బీజేపీ ఇటు వైసీపీల మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపింది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామనుకున్న చోట వైసీపీ నాయకులు టిప్పు సుల్తాన్ విగ్రహం కోసం పూజాది కార్యక్రమాలు చేయడంపై మండిపడ్డారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్, టిప్పు సుల్తాన్ విగ్రహాల విషయంలో ప్రజాభిప్రాయం తీసుకుందాం అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. ఎవరి విగ్రహం కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయల కోసం విగ్రహాల మీద రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది చూస్తున్నారని.. ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగులో శాంతి భద్రతల ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా వైసీపీ చేస్తోంది అని మండిపడ్డారు. వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలతోనే పార్టీ నేతలు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు దిగుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు.

వైసీపీ కావాలనే రాద్దాంతం

సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి అనుమతి కోరుతూ దరఖాస్తు చేశామో అదే ప్లేస్‌లో 10 రోజుల్లో బీజేపి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడుతుంది అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి తెగేసి చెప్పారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం అని అన్నారు. అనంతపురం అర్బన్ వైసీపీ టికెట్ కోసం విగ్రహాల వివాదం తెరమీదకు తెచ్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ టికెట్ పంచాయితీ తాడేపల్లిలో తేల్చుకోండి... ప్రశాంతంగా ఉన్న అనంతపురంలో కాదు అని చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీతో చేతనైతే రాజకీయంగా తేల్చుకోండి... మా పార్టీ సిద్ధంగా ఉంది అని ఛాలెంజ్ చేశారు. గతంలో ప్రొద్దుటూరులో ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఏపీలో ఎక్కడా లేని టిప్పు సుల్తాన్ విగ్రహం అనంతపురంలో ఎందుకు అని నిలదీశారు. కనీసం ఆయన పుట్టిన మైసూర్‌లో కూడా లేదు అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed