- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వైసీపీలో రోజాతో సమాన హోదా దక్కించుకున్న స్టార్ యాంకర్.. జగన్ ప్లాన్ మామూలుగా లేదుగా
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ శ్యామల(Anchor shyamala) గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో రాణించడమే కాకుండా.. ఇటు రాజకీయాల్లోనూ దూసుకెళుతున్నారు. ఇక ఏపీ ఎలక్షన్స్ టైమ్‌లో ఈ అమ్మడు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్‌కు(YS Jagan) మద్దతుగా వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు(chandrababu naidu), పవన్ కల్యాణ్(pawan kalyan)పై సెటైర్లు కూడా వేశారు. ఇవి కాస్త టీడీపీ(TDP), జనసేన(Janasena) నేతల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో ఆమెను చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ వెన్నంటే ఉన్నారు. జగన్ కోసం ఆమె పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించింది. వైసీపీలో ఆమెకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.
తాజాగా వైసీపీ చీఫ్ జగన్.. శ్యామలను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించాడు. శ్యామలతో పాటుగా జూపూడి ప్రభాకర్ రావు(Jupudi Prabhakar rao), భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy), ఆర్కే రోజా(RK Roja)ను అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ వైసీపీ పార్టీ(YCP Party) ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించడం జరిగింది.