- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KotamReddy: ఒక వైపే చూడు.. రెండో వైపు చూడొద్దు అనిల్!
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడే భాష మార్చుకోవాలని హితవు పలికారు. లేకపోతే అంతే స్థాయిలో తమ ప్రతి భాష కూడా ఉంటుందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరులో ఆదివారం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మనిషన్న తర్వాత ప్రతి ఒక్కరికి అనారోగ్యం వస్తుందని, దానిని కూడా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం తగదని సూచించారు.
నారాయణ అరోగ్యం బాగా లేక ఆస్పత్రిలో చేరితే అనిల్ అది కోశారని మాట్లాడటం, ఏం పద్ధతి అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రశ్నించారు. నారాయణకు అనిల్ ఏమైనా డాక్టరా అంటూ గిరిధర్ రెడ్డి ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్‌కు అతి చిన్న వయసులోనే మంత్రి పదవి వచ్చిందని, కానీ దానిని దుర్వినియోగం చేస్తూ ఆయన భాషతో పతనావస్థకు చేరాడని గిరిధర్ రెడ్డి విమర్శలు సంధించారు. నెల్లూరు రూరల్‌లో ఎవరిని గెలిపించాలో ప్రజలే నిర్ణయిస్తారని, అనిల్ చెప్తే తమ భవిష్యత్తు మారదని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.