- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anam Venkata Ramana Reddy: భాష మార్పుకో అనిల్.. లేదంటే..!
దిశ,డైనమిక్ బ్యూరో : ‘మాజీమంత్రి అనిల్ కుమార్ ముందు నీబాబాయ్‌తో నీకున్న వ్యవహారాలు తేల్చుకో. నోరుందని లోకేశ్‌ని, టీడీపీ నేతల్ని విమర్శిస్తే, అంతకంటే ఎక్కువే మేం మాట్లాడతాం. మేం నోరు తెరిస్తే నువ్వు, మీ నాయకుడు తలఎక్కడపెట్టుకుంటారో ఆలోచించుకోండి’ అని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. అనిల్ కుమార్ యాదవ్...తమరు ఒరేయ్, తురేయ్ అంటే తాము దానికిమించి మాట్లాడతామన్నారు. తమ నాయకుడు లోకేశ్ అమెరికాలో చదివాడని గర్వంగా చెప్పుకుంటామన్నారు. మీ నాయకుడు ఏం చదివారో, ఎక్కడ చదివారో చెప్పగలవా అనిల్? అని నిలదీశారు.
సొంత బాబాయ్ సహా, నెల్లూరు జిల్లా వైసీపీనేతలతో, ఆఖరికి మంత్రులతో కూడా ఎందుకు పడటంలేదు అనిల్? అని నిలదీశారు. ‘మీలో మీకు బెట్టింగ్, మాదకద్రవ్యాల సొమ్ములో పంపకాల్లో తేడాలొచ్చి, ఆ నిరాశానిస్పృహల్ని మా నాయకుడిపై చూపిస్తే ఊరుకుంటామా?.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ వరదలేరాని సర్వేపల్లి కాలువపై వాల్స్ కట్టించి, ప్రజలసొమ్ము కొట్టేసిన పెద్ద ముద్దపప్పు అనిల్ కుమార్ యాదవ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. గూడూరులో యువగళం పాదయాత్ర కేంద్రం నుంచి ఆనం వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘వైసీపీనేత, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేశ్ గురించి, యువగళం పాదయాత్ర గురించి నోరేసుకొని తెగవాగుతున్నాడు. అనిల్ నువ్వు లోకేశ్‌ను, చంద్రబాబుని, టీడీపీనేతల్ని విమర్శించడాన్ని మేం తప్పుపట్టడంలేదు. కానీ నువ్వు మాట్లాడేభాష మాత్రం ఎంతమాత్రం సరైందికాదు. లోకేశ్‌ను ఉద్దేశించి, ‘ఒరేయ్ లోకేశ్’ అన్నావు. తిరిగి మేం కూడా ‘ఒరేయ్ జగన్’ ‘ఒరేయ్ అనిల్, తురేయ్ అనిల్’ అంటే నువ్వు, నీ నాయకుడు తలఎక్కడ పెట్టుకుంటారు?. అనిల్ నువ్వుమాట్లాడే మాటలు, నీభాష ఏమాత్రం కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టు కో, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.’ అని గట్టిగా ఆనం వెంకట రమణారెడ్డి హెచ్చరించారు.
‘లోకేశ్‌ను పప్పు అన్నావు. మా నాయకుడు లోకేశ్ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్, కెల్లాక్స్ యూనివర్శిటీల్లో చదివాడు. అనిల్ మీనాయకుడు ఎక్కడ చదివాడు?. మీ హాఫ్ టిక్కెట్ జగన్ రెడ్డి పదోతరగతి తప్పాడు. స్టాన్ ఫోర్డ్ వంటి గొప్పవిశ్వవిద్యాలయంలో చదివిన మా యువనేత పప్పు అయితే, పదో తరగతి తప్పిన మీ నాయకుడు నిప్పా?. భలేఉంది అనిల్. మీనాయకుడు నిజంగా పదో తరగతి పాసై ఉంటే, దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ చూపించండి. పొద్దునలేస్తే జగన్ భజనచేసే అనిల్ కుమార్‌కు నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలతో ఎందుకు పడటంలేదు?.’ అని నిలదీశారు. ‘కాకాణి గోవర్థన్ రెడ్డి, మేకపాటి కుటుంబం, కావలి ప్రతాప్ రెడ్డితో అందరితో ఎందుకుతగువులు పెట్టుకుంటున్నావు.’ అని ఆనం వెంకట రమణారెడ్డి నిలదీశారు.