Somireddy: భాస్కర్‌రెడ్డి జైల్లో ఉంటే అవినాశ్‌రెడ్డి బయట ఉండటమేంటి?

by srinivas |   ( Updated:2023-05-17 11:50:47.0  )
Somireddy: భాస్కర్‌రెడ్డి జైల్లో ఉంటే అవినాశ్‌రెడ్డి బయట ఉండటమేంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో‌: న్యాయస్థానాలతో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆటలాడే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయన్నారు. భాస్కర్ రెడ్ది జైలులో ఉంటే.. అవినాశ్ రెడ్డి బయట ఉండటమేంటి? అని నిలదీశారు. సీబీఐ అవినాశ్‌ను పిలిచినప్పుడల్లా సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారవుతోంది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, పవన్‍ను తిట్టేందుకే ప్రజాధనంతో జగన్ మీటింగ్‍లు నిర్వహిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Also Read..

AP NEWS: అత్యవసరం అయితేనే బయటకు రండి..!

Advertisement

Next Story