- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Breaking: ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాక్.. నెల్లూరు రూరల్ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చించిన అనంతరం నెల్లూరు రూరల్ బాధ్యతలు ఆదాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఆదాలనే పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పష్టం చేశారు.
మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారి తీశాయి.తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణను అధికార పార్టీ నేతలు నిలువరించగలిగారు. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బయటకు తీయడంతో మాటల యుద్ధం మొదలైంది.ఫోన్ ట్యాపింగ్ చేయలేదని వైసీపీ నేతలు అంటుంటే... అది కచ్చితంగా ట్యాపింగ్‌నేనని కోటంరెడ్డి అంటున్నారు. అటు ప్రతిపక్ష నేతలు కూడా అదే మాట చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డికి వైసీపీ అధినేత షాక్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర రెడ్డిని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Nara lokesh Yuvagalam: నారా లోకేశ్ వాహనం సీజ్.. స్వల్ప ఉద్రిక్తత