- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: ఏపీలో మళ్లీ అగ్రిమంటలు.. సీఎం జగన్ మోసం చేశారంటూ టీడీపీ ఫైర్
దిశ, నెల్లూరు: అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే డబ్బులు చెల్లించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు కేపీఆర్ కళ్యాణ మండపంలో రాజకీయ పార్టీలు, ప్రజా, సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు సంగతి, కంపెనీ సంగతి తాను చూసుకుంటానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లిస్తామన్న జగన్, సీఎం అయి నాలుగు సంవత్సరాలు గడిచినా హామీని నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. మొదటి బడ్జెట్‌లోనే రూ.3 వేల కోట్లు కేటాయించి డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు వేలం వేయటం ద్వారా వచ్చిన డబ్బులను అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత కొంతమందికి ఇచ్చి సీఎం జగన్ చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇంకా దాదాపు నాలుగు వేల కోట్లు చెల్లించాల్సిన ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హైకోర్టు ద్వారా అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను సీజ్ చేసి వాటిని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బుల్ని బాధితులకు చెల్లించాలనే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు.
అయితే బినామీ పేర్లతో అగ్రిగోల్డ్ ఆస్తులు తక్కువ ధరకే కొట్టేస్తున్నారని టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ప్రచారం చేయడమే కాకుండా ఆ ఆస్తులు కొనేందుకు ముందుకు వచ్చిన జీ గ్రూప్‌పై కూడా చాలా ఆరోపణలు చేయడంతో వారు వెనక్కు వెళ్ళారని చెప్పారు. వైసీపీ నేతలు నాడు అడ్డుకోకుండా ఉండి ఉంటే అగ్రిగోల్డ్ బాధితులకు అప్పుడే డబ్బులు వచ్చి ఉండేవన్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేని మార్గదర్శి డిపాజిట్‌దార్లుకు ఏదో నష్టం జరిగిందని ఆ సంస్థను వేధిస్తున్న జగన్ మోహన్ రెడ్డి.. లక్షలాది మంది డిపాజిట్‌దార్లను ముంచిన అగ్రిగోల్డ్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు ఎందుకు డబ్బులు చెల్లించడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.