- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: మెడికో ఆత్మహత్య.. సంచలన విషయాలు చెప్పిన మేనమామ
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు నారాయణ కళాశాలలో మెడికో చైతన్య ఆత్మహత్యకు గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చైతన్య ఆత్మహత్యపై మేనమామ శ్రీరామ్ స్పందించారు. చైతన్య తండ్రి చిన్నతనంలోనే ఆర్మీలో చనిపోయాడని, దాంతో ఆమె అమ్మమ్మ ఇంట్లో పెరిగిందని తెలిపారు. చదువులో ఎంతో చురుగ్గా ఉండేదని, కష్టపడి ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. ఈ ఏడాది మార్చి 8న అడిగినంత కట్నం ఇచ్చి చైతన్యకు పెళ్లి చేసినట్లు శ్రీరామ్ తెలిపారు.
అయితే పెళ్లి తర్వాత భర్త, అత్తమామల నిజస్వరూపం బయటపడిందని శ్రీరామ్ అన్నారు. చైతన్యను భర్త వేధింపులకు గురి చేసినట్లు తమకు తెలిసిందని చెప్పారు. భర్తతో తాను వేగలేకపోతున్నానని చైతన్య తరచూ తల్లితో చెప్పేదని శ్రీరామ్ తెలిపారు.
మరోవైపు తన తల్లి, భర్తతో చైతన్య చివరి ఫోన్ కాల్స్ చేసినట్లు తెలిసింది. భర్తతో మాట్లాడిన తర్వాత... తల్లికి కాల్ చేసి హాస్టల్ గదిలోకి వెళ్లి సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైతన్యకు ఆమె భర్తతో ఏమైనా గొడవలు జరిగాయా? లేక కాలేజీలో వేధింపులు ఉన్నాయా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.