- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
LVM3 -M3 రాకెట్ ప్రయోగం విజయవంతం
దిశ, గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి జరిపిన LVM3 - M3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం ఇస్రో వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రయోగం ద్వారా UKకి చెందిన 36 ఉపగ్రహాలను భూమికి దగ్గరలోని 450 కిలోమీటర్ల ఎత్తు కక్షలో ఉపగ్రహాలను నిలపడం జరిగింది. ప్రయోగం అనంతరం 34 నిమిషాలకు మొదటి 16 ఉపగ్రహాలను నింగిలోకి వదలడం జరిగింది. మిగిలిన 20 ఉపగ్రహాలను గంటా 37 నిమిషాలకు నిర్దిష్ట కక్షలోకి పంపడం జరిగింది. 36 ఉపగ్రహాలు కక్షలోకి చేరుకున్న తరువాత ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అయినట్లు ప్రకటించారు. వన్‌వెబ్ ద్వారా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల మేరకు ప్రయోగించిన ఈ రాకెట్ ప్రయోగ విజయం ఇస్రో స్థాయిని మరింత ఉన్నత స్థాయికి పెంచింది.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాధ్ మాట్లాడుతూ LVM3 - M3 రాకెట్ ప్రయోగ విజయం ఒక చారిత్రాత్మకమని, దీని వల్ల ఇస్రోకు వాణిజ్య పరమైన ప్రయోగాల ప్రయోజనాలకు బలం చేకూరిందన్నారు. ఇస్రోకు ఇది ఒక గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సింగపూరుకు చెందిన ఉపగ్రహం PSLV రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు సోమనాధ్ తెలియజేశారు.