Kavali: కోటిన్నర బంగారం, నగదు చోరీ

by srinivas |
Kavali: కోటిన్నర బంగారం, నగదు చోరీ
X

దిశ, కావలి: కావలి ప్రజలు ఎన్నడూ లేని విధంగా ఉలిక్కి పడేల భారీ స్థాయిలో దొంగతనం జరిగింది. ఓ వస్త్ర వ్యాపారి ఇంట్లో 150 సవర్ల బంగారం, రెండున్నర లక్షల నగదు దొంగలు దోచుకెళ్లారు. కావలి బృందావనం హౌసింగ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. వస్త్ర వ్యాపారి చెక్కసూరి బృందావన హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి లొపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కావలిలో భారీ ఎత్తున నగలు, నగదు చోరీకి గురికావడం గమనార్హం. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


Next Story