Viveka Murder Case: వరుసగా చనిపోతున్న సాక్షులు.. ఎస్పీ కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2025-03-06 16:55:27.0  )
Viveka Murder Case: వరుసగా చనిపోతున్న సాక్షులు.. ఎస్పీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు(Former Minister YS Vivekananda Reddy Murder Case)లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సాక్షులుగా ఉన్న వాళ్లంతా వరుసగా చనిపోతున్నారు. వివేకానందారెడ్డి ఇంట్లో పని చేసిన వాచ్‌మెన్ రంగన్న కడప రిమ్స్‌లో మృతి చెందారు. అంతకుముందు ముగ్గురు సాక్షులు శ్రీనివాసుల రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి చనిపోయారు. దీంతో ఎస్పీ అశోక్ కుమార్ (SP Ashok Kumar) సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ నలుగురు సాక్షులు చనిపోయారని తెలిపారు. వరుసగా సాక్షులంతా చనిపోవడంపై అనుమానాలున్నాయని చెప్పారు. ఆరేళ్లుగా కేసు విచారణ జరుగుతోందని, సాక్షులంతా ఒక్కొక్కరుగా మృతి చెందుతున్నారని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.

కాగా 2019 ఎన్నికలకు ముందు వివేకానందారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆ సమయంలో వాచ్ మెన్ రంగన్న ప్రధాన సాక్షిగా ఉన్నారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయనను పోలీసులు విచారించారు. సీబీఐ వాంగ్మూలంలో పలు కీలక విషయాలు తెలిపారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. దీంతో సాక్షులు వరుసగా చనిపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరైనా చేస్తున్నారా..?, యాదృశ్చికంగా జరుగుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Next Story