- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బాలకృష్ణకు పద్మభూషణ్.. అల్లుళ్ల స్పందన ఇదే..!

దిశ, వెబ్ డెస్క్: నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు పద్మభూషణ్(Padma Bhushan) దక్కింది. సినిమా రంగం(Cine Industry)లో ఆయన సేవలను కేంద్రప్రభుత్వం(Central Government) గుర్తించింది. ఈ మేరకు ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. గణతంత్ర్య దినోత్సవం(Republic Day) సందర్భంగా పద్మ అవార్డుల(Padma Awards) జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు తెలుగు వాళ్లకు సైతం అవార్డులు వరించాయి.
అయితే బాలకృష్ణకు పద్మ అవార్డు దక్కడంపై అల్లుళ్లు మంత్రి నారా లోకేశ్( Nara Lokesh), ఎంపీ భరత్(Mp Bharath) స్పందించారు. నారా లోకేశ్, భరత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘మా కుటుంబానికి గర్వకారణమైన క్షణం. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు పొందినందుకు బాలా మావయ్యకు హృదయపూర్వక అభినందనలు. మీ పురాణ ప్రయాణం, బ్లాక్‌బస్టర్ హిట్‌ల నుంచి మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే వరకు, సినిమా, రాజకీయాలు మరియు ఆరోగ్య సంరక్షణకు మీరు చేసిన విశేషమైన సహకారానికి ఈ అవార్డు నిదర్శనం. మీ విజయాలను కేంద్రం గుర్తించబడినందుకు సంతోషిస్తున్నాం.’’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
విశాఖ ఎంపీ భరత్ ట్వీట్‌లో‘‘ మావయ్య బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు లభించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. తెలుగు సినిమా రంగానికి బాలకృష్ణ అంకితభావంతో సేవ చేశారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. అంతేకాకుండా చాలా ఏళ్లుగా సమాజ సేవ చేస్తున్నారు.’’ అని తెలిపారు.