Delhi: బీజేపీలో కిరణ్‌కుమార్ రెడ్డి చేరికపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-04-08 16:50:55.0  )
Delhi: బీజేపీలో కిరణ్‌కుమార్ రెడ్డి చేరికపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సైతం ఆయన కలిశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి ఇచ్చిన విందులో ఆయన పాల్గొన్నారు. అటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కిషన్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డితో సోము వీర్రాజు భేటీ అయి చర్చించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్లు సోము వీర్రాజు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరిక సంతోషంగా ఉందన్నారు. ఏపీలో పొత్తు విషయంపై తాము చాలా స్పష్టంగా ఉన్నామన్నారు. ఏం జరగాలో అది జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నామని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ తమకు చెప్పారని సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై తాము పోరాడుతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed