- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
AP News : విజయసాయిరెడ్డి రాజీనామాపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్సీపీ(YSRCP Party) కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy) రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విజయసాయిరెడ్డి రాజీనామాపై MLA సోమిరెడ్డి(MLA Somireddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందంటూ మండిపడ్డారు. ఆయన ఇపుడు తమాషాగా సేద్యం చేస్తానంటున్నారు.. దోచేసిన నల్లడబ్బుతో చేస్తారా ఏంది అంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేశావని విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి మండిపడ్డారు. గత ఐదేళ్లూ అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్‌గా నిలిచి ఏ2 స్థానాన్ని కొనసాగించావని అన్నారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్లా అని ప్రశ్నించారు. అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తును ముందు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.