- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీమంత్రి నారాయణకు షాక్.. నాట్ బిఫోర్‌మీ అన్న జడ్జి
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీమంత్రి నారాయణకు సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసు విచారణ జడ్జి శ్రీనివాస్ రెడ్డి బెంచ్ ముందుకు వచ్చింది. దీంతో నాట్ బిఫోర్ మీ అని కేసు విచారణ నుంచి జడ్జి శ్రీనివాస్ రెడ్డి తప్పుకున్నారు. అంతేకాదు ఈ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలని న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి హైకోర్టు రిజిస్ట్రీని కోరారు. అనంతరం కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఇటీవలే సీఐడీ అధికారులు మాజీమంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 4న నారా లోకేశ్‌తోపాటు విచారణకు హాజరవ్వాలని కోరుతూ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే ఈ 41 ఏ కింద నోటీసులోని పలు అంశాలను మాజీమంత్రి నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి విచారణకు హాజరుకాలేనంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి నారాయణ. అరవయ్యేళ్ళ వయసులో ఉన్న తనను సీఐడీ కార్యాలయంలో కాకుండా ఇంటివద్దే విచారించాల్సిందిగా సీఐడీని ఆదేశించాలని పిటిషన్‌లో మాజీమంత్రి నారాయణ కోరారు. తాడేపల్లిలోని తమ కార్యాలయానికి రావాల్సిందిగా సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని... కానీ తాను హాజరుకాలేనని కోర్టుకు మాజీమంత్రి నారాయణ తెలియజేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు రెండు రోజులపాటు వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఇదే కేసులో మాజీమంత్రి నారాయణకు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే ముందస్తు బెయిల్‌ను మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.