దారుణం: మహిళా వాలంటీర్‌కు సచివాలయ ఉద్యోగుల లైంగిక వేధింపులు

by Seetharam |
దారుణం: మహిళా వాలంటీర్‌కు సచివాలయ ఉద్యోగుల లైంగిక వేధింపులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మహిళలకు ప్రతీచోట రక్షణ కరువైంది.మహిళా పోలీసు ఉన్న సచివాలయంలోనే వాలంటీర్‌కు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఏడాది నుంచి వలంటీర్‌ను వేధించడంతో ఆమె మీడియాను ఆశ్రయించింది. వివరాల్లోకి విశాఖ జిల్లా పెందుర్తి మండలం జోన్ 8 జీవీఎంసీ డౌన్ 486 సచివాలయం పరిధిలో 69వ వార్డు వలంటీర్‌గా మహిళ పనిచేస్తోంది. ఆమె ప్రేమవివాహం చేసుకుంది. అయితే సచివాలయంలో అడ్మిన్‌గా రాము, వేరే ఉద్యోగి కిరణ్‌లు వలంటీర్‌ను లైంగికంగా వేధిస్తున్నారు. తమతో చాట్ చేయాలని పదేపదే ఒత్తిడి పెంచారు. అంతేకాదు సెల్ ఫోన్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు ఫోటోస్ డౌన్‌లోడ్ చేసుకుని ఏడిపించారు. రోజు రోజుకు సచివాలయ ఉద్యోగుల వేధింపులు తీవ్రమవ్వడంతో బాధిత వలంటీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన భర్త సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పింది. అనంతరం సచివాలయ ఉద్యోగులు రాము, కిరణ్‌లను బాధిత వలంటీర్, ఆమె భర్త నిలదీయగా ఇకపై తాము ఎలాంటి వేధింపులకు గురి చేయమని హామీ ఇచ్చారు. అంతేకాదు లెటర్ సైతం రాసి ఇచ్చినట్లు బాధితురాలు వలంటీర్, ఆమె భర్త మీడియాకు తెలిపారు. పది రోజులపాటు తనపట్ల సైలెంట్‌గా ఉన్న వారు మరింత రెచ్చిపోయారని ఆమె కన్నీటి పర్యంతమైంది. మళ్లీ ఏడిపించడం మెుదలు పెట్టారని వాపోయింది. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్తే ఇలాంటివి తరచూ జరుగుతుంటాయని చూస్తూ చూడనట్లు వెళ్లిపోవాలని అన్నారని దాంతో తాము మీడియాను ఆశ్రయించినట్లు బాధితురాలు వాపోయింది. తమ ఉద్యోగం తీసేస్తామని ఒకసారి.. జీతాలు వెయ్యనీయమని మరోసారి తమతో చాటింగ్ చేయాలంటూ ఇలా నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. తమతోపాటు సచివాలయ పరిధిలోని మహిళల మెుబైల్ నంబర్స్ తీసుకుని ఇలానే లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. సచివాలయ ఉద్యోగులు రాము, కిరణ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.

Advertisement

Next Story

Most Viewed