- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: భూ రికార్డుల భద్రతపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయిన విషయం తెలిసిందే. భూ రికార్డులకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం అయినట్లు నిర్ధారణ అయింది. ఫైళ్ల దగ్ధంపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. భూ రికార్డుల భద్రత బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించారు. రెవెన్యూ శాఖపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్లపై వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
సబ్ కలెక్టర్ కార్యాలయాల్లోకి ఫైళ్లు, డాక్యుమెంట్లను భద్రం చేయాలని సిసోడియా సూచించారు. అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పిటిషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, సీఎం వరకు వెళ్లే ఛాన్స్ ఇవ్వొద్దని తెలిపారు. రికార్డుల భద్రతకు పోలీసుల సాయం తీసుకోవాలని చెప్పారు. భూములు కబ్జాపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. భూ సమస్యలపై కలెక్టర్లు, ఎస్పీలు దృష్టి సారించాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల 59 వేల ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ చేశారని, వీటిలో 25,230 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిపోయాయని తెలిపారు. అసైన్డ్ భూములను అనర్హులకు కట్టబెట్టారని, మరికొంత మందికి తక్కువ ధరకే భూములు కట్టబెట్టారని సిసోడియా మండిపడ్డారు.