‘అప్రూవర్‌గా విజయసాయి.. పులివెందులకు ఉప ఎన్నిక ఖాయం’

by Gantepaka Srikanth |
‘అప్రూవర్‌గా విజయసాయి.. పులివెందులకు ఉప ఎన్నిక ఖాయం’
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బీటెక్ రవి సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. విజయసాయి రెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమని ఆరోపించారు. జగన్ డిస్‌క్వాలిఫై అవ్వడం కూడా ఖాయమని జోస్యం చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం కాబోతోందని అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి.. సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని అన్నారు. పవన్ కళ్యాణ్‎తో చిరకాల స్నేహం ఉందని... ఇకపై తన భవిష్యత్తు వ్యవసాయమని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.






Next Story

Most Viewed