- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసులు పెట్టి ప్రత్యర్థులను ఇరిస్తున్నారు: మాజీ మంత్రి కాకాని సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ పోర్టు వివాదం(Kakinada Port Controversy) చిలికి చిలికి గాలి వానలా మారింది. సముద్ర మార్గం ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ తరలిస్తున్న వ్యవహారం బయటపడటంతో రాజకీయ వాతావారణం వేడికెక్కింది. వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇందుకు కౌంటర్‌గా కేవీరావు అనే వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి(Former Minister Kakani Govarthan Reddy) స్పందించారు. కాకినాడ పోర్టు వివాదంలో ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. పాత కేసులను తిరగతోడి ప్రత్యర్థులను ఇరికిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్త కేసులు పెడుతూ నేతలను బెదిరిస్తు్న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసుల్లో భాగమే కాకినాడ పోర్టు కేసులని ఆరోపించారు. మొదట రేషన్ బియ్యం స్మగ్లింగ్ పేరుతో డ్రామా చేశారని, ఆ తర్వాత పోర్టునే లాక్కుకున్నారని ప్రచారం చేశారని ఆరోపించారు. అసలు పోర్టును కేవీరావుకు కట్టబెట్టిందే చంద్రబాబు అని కాకాని గోవర్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు.