AP News:పిఠాపురంలో పర్యటించిన వైఎస్ జగన్..స్పందించిన టీడీపీ సీనియర్ నేత

by Jakkula Mamatha |
AP News:పిఠాపురంలో పర్యటించిన వైఎస్ జగన్..స్పందించిన టీడీపీ సీనియర్ నేత
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) బుడమేరు వాగు(Budameru River) ఉప్పొంగి విజయవాడను ముంచెత్తింది. ఈ క్రమంలో విజయవాడ(Vijayawada)లో వరదలు బీభత్సం(Panic) సృష్టించాయి. అయితే ఈ వరద(Floods)లపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న(శుక్రవారం) పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఏలేరు, బుడమేరు గురించి మీడియాతో మాట్లాడారు. ‘కాలువల అభివృద్ధి పనులు చేపట్టాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, పైగా ప్రాజెక్టులో నీరు పూర్తిస్థాయిలో ఉండడంతో రైతులు పంటలు పండించుకుంటారు అనే ఉద్దేశంతో తాము క్రాప్ హాలిడే ప్రకటించలేదని..తమ ప్రభుత్వం(వైసీపీ) హయాంలో ఏలేరు పనులు చేపట్టలేకపోవడానికి ఇదే కారణమని’ వైఎస్ జగన్ వివరణ ఇచ్చారు.

దీనిపై టీడీపీ సీనియర్ నేత(TDP Leader) దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు. ఏలేరు, బుడమేరు పాపం జగన్ దేనని తేలిపోయిందని విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) మొదలుపెట్టిన ఏలేరు ఆధునికీకరణ పనులు ఐదేళ్లలో తాము చేయలేదని జగన్ ఒప్పుకున్నారని వెల్లడించారు. పురుషోత్తపట్నం లిఫ్ట్, బుడమేరు ఆధునికీకరణ పనులు సైతం ఆపేశారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. చేసిన పాపం కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పడం, ఫేక్ ప్రచారాలు చేయడంలో జగన్ రెడ్డి గోబెల్స్‌ను మించిపోయాడని ఫైరయ్యారు. సీఎం చంద్రబాబు బాధితులకు అండగా ఉండటంతో జగన్ ఆందోళన చెందుతున్నాడని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed