ఎమ్మెల్యే ఫ్లెక్సీకి సీఐతో సహా 15 మంది పోలీసుల సెక్యూరిటీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-27 04:31:30.0  )
ఎమ్మెల్యే ఫ్లెక్సీకి సీఐతో సహా 15 మంది పోలీసుల సెక్యూరిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పాడటం చూస్తునే ఉన్నాం. కానీ ఒక్కొసారి పోలీసుల తీరు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా నెల్లూరు నగరంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సే అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీకి సీఐతో పాటు 15 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. రెండు రోజుల క్రితం అనిల్ కుమార్ బర్త్ డే సందర్భంగా నర్తకి సెంటర్‌లో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ విగ్రహానికి అనిల్ కటౌట్ అడ్డుగా ఉందని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను టీడీపీ నగర ఇన్ ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగిస్తారమో నన్న అనుమానంతో సీఐతో పాటు 15 మంది ఫ్లెక్సీ వద్ద గస్తీ కాశారు. ఫ్లెక్సీలపై నిషేధం అంటూనే ఇలా పహారా కాయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed