ఇకనైనా కుటుంబ, కుల పార్టీలకు గుడ్ బై చెప్పండి.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
ఇకనైనా కుటుంబ, కుల పార్టీలకు గుడ్ బై చెప్పండి.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలు ఇకపై జీవితంలో గెలవవు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Praja Shanthi Party President KA Paul) అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై (MLC Elctions Candidate Selection) స్పందించిన ఆయన కూటమి పార్టీలపై (Kutami Parties) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Leader Pawan Kalyan) తాను చెప్పినట్టే చేశాడని, ఎమ్మెల్సీ టికెట్ తన అన్న నాగబాబుకే (Nagababu) ఇచ్చుకున్నాడని అన్నారు.

అలాగే ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో చంద్రబాబు (Chandrababu) మాట తప్పాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో (Assembly Elcetions Time) పిఠాపురం (Pitapuram)లో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే టీడీపీ నేత వర్మకు (TDP Leader Varma) ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్ధానం చేశాడని, కానీ ఇప్పుడు చేతులు ఎత్తేశాడని అన్నారు. పాపం వర్మ ఎమ్మెల్సీ టికెట్ హామీ నిలబెట్టుకోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చుట్టూ తిరుగుతున్నాడని, వాళ్లు మాట నిలబెట్టుకోరని వర్మకు తాను అప్పుడే చెప్పానని, కానీ వర్మకు బుద్ది లేక నా మాట వినలేదని మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు (Former MLA Dorababu) మళ్లీ జనసేనలో చేరారని, అసలు ఆయనకు బుద్ది ఉందా అంటూ.. తెలివైన వాళ్లు ఎవరు కూడా ఆ పార్టీలో చేరరని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే చాప్టర్ క్లోజ్ అయ్యిందని, మొత్తం అవినీతి మయం అయ్యిందని, ఇక లైఫ్ లో టీడీపీ, జనసేన పార్టీలు గెలిచే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. అంతేగాక వచ్చేది కేవలం ప్రజా శాంతి పార్టీయేనని, బడుగు బలహీన వర్గాల పార్టీయేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజాశాంతి పార్టీలో చేరి, ప్రజలకు సేవ చేయాలని, కుటుంబ, కుల పార్టీలకు గుడ్ బై చెప్పాలని సూచించారు.

Next Story

Most Viewed