చంద్రబాబుపై ట్విట్టర్‌లో సెటైర్లు.. రియల్ గ్రామ వాలంటీర్ RGV అని నెటిజన్లు ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-12 09:16:15.0  )
చంద్రబాబుపై ట్విట్టర్‌లో సెటైర్లు.. రియల్ గ్రామ వాలంటీర్ RGV అని నెటిజన్లు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆర్జీవీ చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరో సెటైర్ వేశారు. ‘మై నాట్ డియర్ ఏపీ ప్రజలరా, నలభై సంవత్సరాల నుంచి ఒక్క రుపాయి కూడా ఆశించకుండా మీకు పగలు, రాత్రి సేవ చేసిన వారిని లోపల వేసినందుకు బంద్‌కు పిలిపు ఇస్తే, ఏ మాత్రం కేర్ చేయకుండా మీ పనులు చేసుకుంటూ.. సినిమాలు చూసుకుంటూ, షాపింగ్‌లు చేసుకుంటున్నారా? అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు ఉంటుందా? అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. దీనిపై టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. రియల్ గ్రామ వాలంటీర్ RGV అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇంకో నెటిజన్ స్పందిస్తూ ‘సినిమాల్లో ఎలాగో అవార్డులు రావడంతో ఉత్తమ గ్రామ వాలంటీర్ అవార్డు తీసుకుందువులే అంటూ రాసుకొచ్చాడు.

Read More: ఇంతకన్న వెన్నుపోటు ఇంకొకటి ఉంటుందా..? ఏపీ ప్రజలను ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ ట్వీట్

Advertisement

Next Story