ఆ రోజే ఫీజు పోరు కార్యక్రమం.. పార్టీ నేతలకు సజ్జల కీలక సూచనలు

by Jakkula Mamatha |
ఆ రోజే ఫీజు పోరు కార్యక్రమం.. పార్టీ నేతలకు సజ్జల కీలక సూచనలు
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ ముఖ్యనేతల(YCP Leaders)తో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్(Party State Coordinator) సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) నేడు(శుక్రవారం) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM YS Jagan) నిర్ణయం మేరకు ఈ నెల(మార్చి) 12వ తేదీన నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆ రోజే వైసీపీ ఆవిర్భావ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని.. పార్టీ కేడర్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ వేడుకల్లో మన పార్టీ పై ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదనేది వెల్లడవ్వాలని ఆయన పేర్కొన్నారు.

ఇక పార్టీ ఆవిర్భావ వేడుకలు ఉదయాన్నే పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ(YSRCP) జెండా ఎగరాలని ఆయన వ్యాఖ్యానించారు. ఫీజు పోరు కార్యక్రమం సందర్భంగా వైసీపీ కేడర్ ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు మెమోరాండం అందించనున్నట్లు తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు, యువతను మోసగించిన కూటమి ప్రభుత్వం(AP Government) పై శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఆయన వెల్లడించారు.



Next Story

Most Viewed