రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక సైలెంట్‌గా ఉన్నా:YCP MLA Vasantha Krishnaprasad

by GSrikanth |   ( Updated:2023-01-10 02:26:47.0  )
రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక సైలెంట్‌గా ఉన్నా:YCP MLA Vasantha Krishnaprasad
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనూహ్య వ్యాఖ్యలు చేశారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయం చేస్తోందని.. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారన్నారు. ఆ రోజులతో పోల్చితే ప్రస్తుత రాజకీయాల్లో చాలా మార్చు జరిగిందన్నారు. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక తాను పాతతరం నాయకుడిగానే మిగిలిపోయానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కోసారి రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేను ఎందుకయ్యానా? అని బాధపడుతున్నానని కామెంట్ చేశారు. సగటు వ్యక్తులకు కొన్నిసార్లు సాయం చేయలేకపోతున్నామని ఆవేదన చెందారు. తాను గత మూడున్నరేళ్లలో ఎక్కడా అక్రమ కేసులు పెట్టించలేదని వ్యాఖ్యానించారు. పథకాలు ఆపలేదని.. కేసుల విషయంలో కొంతమంది తమ నాయకులకు తనపై అసంతృప్తి ఉండొచ్చన్నారు. అంతేగాక ఇటీవల గుంటూరు తొక్కిసలాట ఘటనను రాజకీయ కారణాలతో విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నారై, ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ మంచి వ్యక్తి అన్నారు. గుంటూరులో తొక్కిసలాట దురదృష్టకరమని అన్నారు.



Next Story

Most Viewed