- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులకు గుర్తొచ్చిన నిబంధనలు..వైసీపీ మంత్రులకు, శానసభ్యులకు చుక్కలే
దిశ వెబ్ డెస్క్: ఎన్నికల నోటీఫికేషన్ వారం పది రోజులలో వెలువడనుండగా అధికారులకు అకస్మాత్తుగా నియమ నిబందనలన్ని గుర్తుకు వచ్చేశాయి. దీనితో ఇకపై మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే కుదరుదంటూ ఏకంగా మంత్రినే బయటకు పొమ్మనేంత ధైర్యం వచ్చేసింది. అలానే పోలీసుల్లోనూ పెను మార్పు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఇంతకాలం అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తిన పోలీసులు కూడా ఇప్పుడు కాస్త నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఒక హత్యాయత్నం కేసులో చూసీ చూడనట్లు వ్యవహరించాల్సిందిగా 20 వ వార్డు కార్పోరేటర్ మువ్వల సురేష్ తీసుకువచ్చిన వత్తిడిని సైతం లెక్క చేయక విశాఖ మూడవ పట్టణ పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు ఎవరికీ బానిసలుకారని చేతల్లో చూపించారు.
దీనితో నాలుగున్నర సంవత్సరాల తరువాత పలు కేసుల్లో కాస్త న్యాయం జరుగుతుందని బాధితులు ఉపశమనం చెందుతున్నారు. మూడు రోజుల క్రితం నగర పోలీసు కమీషనర్ డాక్టర్ రవి శంకర్ ప్రత్యేకంగా భూకబ్జాలపై నిర్వహించిన స్పందనకు పెద్ద సంఖ్యలో 190 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ ప్రతి వారం స్పందన నిర్వహిస్తున్న భూ కబ్జాలు, లావాదేవీలపై ఇన్ని ఫిర్యాదులు రావడం అధికారులను పునరాలోచనలో పడేసింది.
ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందనలో ఇచ్చే ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే పోలీసుల దగ్గరకు వందల మంది బాధితులు వచ్చారని సాటి అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. కబ్జాల విషయంలో పోలీసు చర్యలు వెంటనే ప్రారంభం కావడం బాధితులలో కాస్త నమ్మకాన్ని పెంచింది.
అలానే జిల్లా కలెక్టర్ ఆధీనంలో వుండే సర్క్యూట్ హౌస్ లో కూర్చొని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని, బీజేపీతో జత కట్టిన తెలుగుదేశం , జనసేనలను తిడతానంటే ఊరుకొనేది లేదంటూ అత్యంత సౌమ్యులుగా, అధికార పార్టీ తొత్తులుగా పేరుపడ్డ విశాఖ అధికారులు రాష్ర్ట పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాధ్ ను బయటకు వెళ్లమన్నారు.
తాజాగా కుదిరిన పొత్తులకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు విశాఖ సర్య్కూట్ హౌస్ లో శనివారం సాయంత్రం ఏర్పుటు చేసిన విలేకరుల సమావేశానికి విచిత్రంగా అధికారులు అడ్డు తగిలి తమకు కూడా వెన్నుముక వున్నదని నాలుగేళ్ల పది నెలల తరువాత నిరూపించారు. అసలే టికెట్ దక్కక తీవ్ర అవేదనలో వున్న గుడివాడ అమర్నాథ్ కు మరో అమవానం జరిగింది.
చివరకు సర్య్కూట్ హౌస్ లో కూర్చొని మాట్లాడే అవకాశం కూడా లేదని అధికారులు కన్నెర్ర జేయడంతో చేసేదీ లేక బయటకు వచ్చి ఓ చెట్టు క్రింద నిలబడి విలేకరులతో మాట్లాడాల్సివచ్చింది. ఇంతకాలం అధికార కార్యక్రమాలకు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాలకు తేడా తెలియకుండా వ్యవహరించిన, అందుకు సాయం చేసిన జిల్లా యంత్రాగానికి ఒక్క సారిగా నిబంధనలకు గుర్తుకు రావడం అందరినీ ఆశ్చర్యపరచింది.
నాలుగు రోజుల క్రితం విశాఖ వచ్చిన అధికార భాషా సంఘం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి సర్య్కూట్ హౌస్ లో ఇదే మాదిరిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తిట్ల దండకం అందుకోవాలని ప్రయత్నించినప్పడు కూడా అధికారుల అడ్డు తగిలారు. చివరకు ఆమె పార్టీ కార్యాలయంలో మాట్లాడాల్సివచ్చింది.