Breaking: విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

by srinivas |   ( Updated:2025-02-21 16:00:16.0  )
Breaking: విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada) పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు(RTC BUS) బీభత్సం సృష్టించింది. స్టాండింగ్‌లో ఉన్న బస్సును తీసే సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పింది. ప్లాట్ ఫామ్‌పైకి దూసుకెళ్లింది. మూడో నెంబర్ పిల్లర్‌ను ఢీకొట్టింది. అయితే అక్కడ ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అటు బస్సు డ్రైవర్ కు కూడా ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ బస్సు కదిలిన సమయంలో పక్క ప్లాట్ ఫామ్‌పై ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు కదలడంతో అదిరిపోయారు. పెద్దగా అరుపులు, కేకలు వేశారు. దీంతో గందరగోళం నెలకొంది. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇందుకు బస్సు డ్రైవర్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే గతంలోనూ ఇదే బస్టాండ్‌లో పెను ప్రమాదం జరిగింది. 2023 నంబర్ 6న 12వ నెంబర్ ప్లాట్ ఫామ్‌పై నిలుచుకున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కండక్టర్ సహా మరో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఘటన జరిగింది. ఇప్పుడు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed