ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడం కోసం పటిష్టమైన క్యూఆర్ సాంకేతికత..

by Jakkula Mamatha |   ( Updated:2024-02-22 13:58:53.0  )
ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడం కోసం పటిష్టమైన క్యూఆర్ సాంకేతికత..
X

దిశ, రాయచోటి : పదోతరగతి ప్రశ్నా పత్రాల లీకేజీని అరికట్టడం కోసం పటిష్టమైన క్యూఆర్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యల ద్వారా అత్యంత పటిష్టవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రశ్నాపత్రాల సీల్డ్ కవర్లను తెరిచేటప్పుడు సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం, పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, ఫ్లయింగ్ స్క్వాడ్, వంటి అనేక చర్యల ద్వారా పరీక్షలను పటిష్టవంతంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలకు ముద్రించే ప్రశ్నాపత్రంలో క్యూఆర్ కోడ్ ముద్రించబడుతుందని, రాష్ట్రంలో పరీక్ష వ్రాయబోయే ప్రతి విద్యార్థికి ఇవ్వబోయే ప్రశ్నాపత్రంలో క్యూఆర్ కోడ్ వేరువేరుగా ఉంటుందని, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి, ప్రశ్నపత్రం లీకేజీ అయితే ఆ ప్రశ్న పత్రం ఏ విద్యార్థి దగ్గర నుంచి లీక్ అయిందో క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎవరూ ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడవద్దని సూచించారు.


Read More..

ముగిసిన సమన్వయ కమిటీ సమావేశం.. భారీ బహిరంగ సభ ఆరోజే..!

Advertisement

Next Story

Most Viewed