రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, మరో 10 మందికి గాయాలు

by Mahesh |
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, మరో 10 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(State of Andhra Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Fatal road accident) జరిగి నలుగురు మృతి (Four died) చెందిన విషాద ఘటన (tragic incident) చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలోని నగరిలో ప్రమాదం చోటు చేసుకోగా నలుగురు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి-చెన్నై జాతీయ రహదారి (Tirupati-Chennai National Highway)పై వేగంగా వచ్చిన లారీ , బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురితో పాటు మరొకరు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు (police) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి పట్టణంలోని రుయా ఆస్పత్రి (Ruya Hospital)కి తరలించారు.

కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ యాక్సిడెంట్ (Accident) జాతీయ రహదారిపై జరగడంతో నిమిషాల వ్యవధిలోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (Traffic jam)ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలకు పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేసినట్లు తెలుస్తుంది.


Next Story

Most Viewed