- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణకు మంచి రోజులు వస్తున్నాయ్: తిరుమలలో రేవంత్ రెడ్డి

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామి వారి పట్టువస్త్రంతో పాటు తీర్థప్రసాదాలను రేవంత్ రెడ్డి దంపతులకు అందజేశారు. అనంతరం ఆలయం బయట మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.ఇరు రాష్ట్రాల మధ్య ఆర్థిక, రాజకీయ బంధాలు బాగుండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. త్వరలో తెలంగాణకు మంచిరోజులు రాబోతున్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story