Ap Liquor Scam: ఎట్టకేలకు స్పందించిన కసిరెడ్డి.. కీలక ఆడియో విడుదల

by srinivas |   ( Updated:2025-04-19 11:02:10.0  )
Ap Liquor Scam: ఎట్టకేలకు స్పందించిన కసిరెడ్డి.. కీలక ఆడియో విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) ఎట్టకేలకు స్పందించారు. ఇంతకాలం పరారీలో ఉన్న ఆయన కేసుపై వివరణ ఇస్తూ తాజాగా ఆడియో విడుదల చేశారు. మార్చిలోనే సిట్ పోలీసులు(SIT Police) తన ఇంటికి వెళ్లారని తెలిపారు. అయితే ఆ సమయంలో తాను లేనని, తన తల్లికి నోటీసులు అందజేశారని చెప్పారు. లిక్కర్ కేసులో తనను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారని వెల్లడించారు. అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే ఎందుకు పిలిచారని సిట్ పోలీసులను తాను అడిగినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత తన మెయిల్‌కు మరోసారి నోటీసులు పంపారని తెలిపారు. దాంతో లాయర్‌ను సంప్రదించానని, ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని రాజ్ కసిరెడ్డి పేర్కొన్నారు.

అయితే ఇదే కేసులో రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి(Raj Kasireddy father Upender Reddy)ని విజయవాడ కార్యాలయంలో ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. కసిరెడ్డి ఆచూకీ, ఆర్థిక లావాదేవీలు, ఆయనతో సంబంధాలున్న వ్యక్తులపై ఆరా తీశారు. అయితే తనకేమీ తెలియదని 'సిట్ అధికారులకు ఉపేందర్ రెడ్డి తెలిపారు. దీంతో మరోసారి విచారణకు రావాలని చెప్పారు.



Next Story

Most Viewed