- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యపాన నిషేధం.. YS Jagan Mohan Reddy పై Pawan Kalyan తీవ్ర విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను పక్కకు పెట్టి ఎక్కువగా పాలిటిక్స్ మీద దృష్టి పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సుమారు రెండేళ్లకుపైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే సిద్ధమవుతున్నాయి. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నో కార్యక్రమాల్లో మద్యం నిషేధం గురించి చర్చించిన విషయం తెలిసిందే.
తాజాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్ కు పవన్ రీట్వీట్ చేస్తూ ''సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం చిన్న గమనిక: సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే..'అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు' అంటూ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం
— Pawan Kalyan (@PawanKalyan) June 12, 2022
చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే..
సామెతలు 12:22
అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు https://t.co/cthy29YWc5