- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ అంటే పవనం కాదు తుఫాన్.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల భేటీ జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చారిత్రాత్మక విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇందుకు తోడ్పడ్డారు. పవన్ కాదు.. అతనొక తుపాన్ అని మోడీ వ్యాఖ్యానించారు. కేవలం పవన్ కల్యాణ్ వల్లే ఏపీలో భారీ విజయం లభించిందని అన్నారు. ఇటీవలే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి.. అంతే త్వరగా ప్రజల విశ్వాసం కోల్పోయాయి.
ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి మంచి ఫలితాలు సాధించిందని అన్నారు. తమిళనాడులో మన కూటమికి సీట్లు రాకపోవచ్చు. కానీ, మున్ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం అని అన్నారు. అంతకుముందు NDA పక్ష నేతగా నరేంద్రమోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోడీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదిస్తే అమిత్‌షా, నితిన్ గడ్కరీ బలపరిచారు. NDA పక్ష నేతగా 3వ సారి ఎన్నికైన నరేంద్ర మోడీ.. ప్రధానిగా సేవలు అందించబోతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీష్ సహా 9 మంది ఎన్డీయే మిత్రపక్షాల నేతలు వేదికపై ఉన్నారు.