- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Nara lokesh: వాట్సప్ నెంబర్ పంపితే.. ఆ వీడియోలు పంపుతా..?

దిశ, వెబ్ డెస్క్: స్నేహితులతో ఈత కొడితే సీఎం జగన్‌కు ఎందుకు బాధ వచ్చిందోనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేశారు. లోకేశ్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాట్సప్ నెంబర్ పంపితే స్విమ్మింగ్ వీడియోలు పంపిస్తానని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో యువగళం పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ మార్కాపురంలో అతి పెద్ద భూ స్కాం జరిగిందని ఆరోపించారు. ఛోటా నయీం గ్యాంగ్ రూ.800 కోట్ల విలువైన భూమిని హాంఫట్ చేసిందన్నారు. బినామీల పేరుతో 378 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేశారని లోకేశ్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆ భూముల కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేస్తామని లోకేేశ్ చెప్పారు. కబ్జాకు గురైన భూములు వెనక్కి తీసుకుంటామని లోకేశ్ హెచ్చరించారు. అంతేకాదు ఆ భూములను పేదలకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఛోటా నయీం గ్యాంగ్ చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు.