Ongole: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కొంత పురోగతి

by srinivas |   ( Updated:2025-04-25 09:22:54.0  )
Ongole: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కొంత పురోగతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి(Tdp Leader Veeraiah Chowdary) హత్య కేసు(Murder Case) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఐదుగురు దుండగులు ఆయనను హత్య చేసి పారిపోయారు. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. వీరయ్య హత్య జరిగిన సమయంలో నిందితులు వాడిన స్కూటీని గుర్తించారు. చీమకుర్తి బైపాస్ రోడ్డు(Chimakurthi Bypass Road)లోని ఓ దాబా వద్ద స్కూటీ(Scooty)ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంతనూతలపాడు(Santanuthalapadu), చీమకుర్తి వైపు పరారీ అయినట్లు గుర్తించారు. కానీ నిందితులు ఎవరనేది ఇప్పటి వరకూ స్పష్టంగా కనిపెట్టలేకపోయారు. నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం(Prakasam), నెల్లూరు(Nellore), గుంటూరు(Guntur) జిల్లాలో పోలీసులు గాలిస్తున్నారు.

కాగా టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఈ నెల 23న దారుణ హత్యకు గురయ్యారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఉండగా మాస్కులు ధరించి రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వీరయ్య చౌదరి ఛాతీ, గొంతు, పొట్లపై పదిహేను కత్తి పోట్లు పొడిచారు. అనంతరం పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.



Next Story

Most Viewed