- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ongole: అది దుష్ప్రచారం.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బాలినేని
దిశ, వెబ్ డెస్క్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజంలేదని ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అదంతా ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నానని.. తాను ఇతర పార్టీల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో పని చేస్తామని బాలినేని పేర్కొన్నారు. విపక్షాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి తప్ప.. పార్టీ మారే ఆలోచన తనకు లేదని బాలినేని స్పష్టం చేశారు.
కాగా ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారతారని కొద్ది రోజలుగా ప్రచారం జరుగుతోంది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆది మూలపు సురేశ్‌తో ఉన్న వర్గ విభేదాలతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీని బాలినేని వీడబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అటు సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం బాలినేనితో స్వయంగా మాట్లాడారు. అయినా బాలినేని పార్టీ మారబోతున్నారనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. మీడియా సాక్షిగా తాను వైసీపీని వీడటం లేదని వెల్లడించారు.