- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MP Magunta: నా కుమారుడు ఎంటువంటి తప్పు చేయలేదు
- - 50 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నాం
- - రాజకీయ కుట్రలో భాగంగానే అక్రమ కేసు
- - మాగుంట కుటుంబం ఎప్పుడూ తప్పుచేయదు
దిశ, ఏపీ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో తన కుమారుడు రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. 70 ఏళ్లుగా తమ కుటుంబం వ్యాపారాల్లో ఉందని, తాను 50ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని తెలిపారు. తమ కుటుంబ వ్యాపారాలు దేశంలోని పది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని స్పష్టం చేశారు. తన తండ్రి స్థాపించిన వ్యాపారాన్ని తాము 70 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. వ్యాపారాలు చేసే క్రమంలో ఎలాంటి తప్పులు తాము చేయలేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.
శ్రీనివాసులురెడ్డిని కలిసిన బాలినేని
మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కలిశారు. ఢిల్లీ మద్యం సంఘటనపై పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి మనోధైర్యంతో ఉండాలని చెప్పారు. అనంతరం మాగుంట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగానే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డిని అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. మాగుంట కుటుంబం ఎప్పుడూ తప్పుచేయదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని బాలినేని వ్యాఖ్యానించారు.
ఎన్నో ఏళ్ళుగా మాగుంట కుటుంబం లిక్కర్ వ్యాపారం చేస్తుందని బాలినేని తెలిపారు. 1991లో జిల్లా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. 32 ఏళ్ల మాగుంట కుటుంబ రాజకీయ జీవితంలోఎవరితోను విభేదాలు లేవన్నారు. తామంతా మాగుంట కుటుంబం వెంట నడుస్తామని బాలినేని తెలిపారు. కన్న కుమారుడు అక్రమ కేసులో ఇరుక్కున్నప్పుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి మనస్సు కుదుట పర్చుకుని, మనోధైర్యంతో ఉండాలని బాలినేని సూచించారు.